- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఒంటిచేత్తో లాక్కొచ్చే సత్తా పంత్‌కు ఉంది : రహానే

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ గడ్డపై దేశం గర్వపడేలా టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. గత 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని సత్తా చాటింది. టీమిండియా సమిష్టి ప్రదర్శనతో అద్భుతంగా రాణించింది. సీరిస్‌లో అద్భుతంగా రాణించిన యువ క్రికెటర్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ సీనియర్ క్రికెటర్ల నుంచే కాకుండా, ఇతర దేశ ఆటగాళ్లు సైతం పంత్ ప్రదర్శనను మెచ్చుకున్నారు.
అయితే తాజాగా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన పంత్‌పై అజింక్య రహానే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రిషబ్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటాడని, సీరిస్‌లో 97 పరుగుల వద్ద ఔట్ అయినప్పుడు చాలా నిరాశ చెందాడని తెలిపారు. మళ్లీ వెంటనే తేరుకుని బ్రిస్బేన్‌లో అదే తరహా ఇన్నింగ్స్ ఆడాడని, తన ఆట ఎలా ఉంటుందో చూపించాడని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాపై పంత్ మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడని వెల్లడించాడు. పంత్ ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే ఎలాంటి మ్యాచ్‌ను అయినా తమ చేతిలోకి తీసుకొచ్చి, ఒంటిచేత్తో మనవైపు లాక్కొస్తాడని అభినందించాడు.