పెన్షన్ విద్రోహ దినం… ఉపాధ్యాయుల నిరసన

by Shyam |   ( Updated:2020-09-01 04:46:45.0  )
పెన్షన్ విద్రోహ దినం… ఉపాధ్యాయుల నిరసన
X

దిశ, సిద్దిపేట: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇస్తున్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబరు 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేటలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ…

రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలన్నారు. జీఓ 28ను రద్దు చేసి రాష్ట్రంలో ఓపీఎస్ అమలు చేయాలన్నారు. 50 శాతం ఉపాధ్యాయులు మాత్రమే ప్రతి రోజు విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వెల్‌నెస్ సెంటర్‌లో ఏర్పడిన మందుల కొరత తీర్చాలన్నారు. కోవిడ్ వ్యాప్తి సందర్భంగా 50 ఏండ్లు పైబడిన వృద్దులకు, గర్బిణులకు, దివ్యాంగులకు విధులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed