జగన్ సీఎం అయ్యాకే… వాళ్లకు మంచి రోజులు

దిశ, వెబ్‌డెస్క్: అవరావతి వైసీపీ కార్యాలయంలో గురుపుజోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శంకర్ నారాయణ, వెల్లంపల్లి, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ…

గురువులేని విద్య ఉండదన్నారు. జగన్ సీఎం అయ్యాక ఉపాధ్యాయులకు మంచిరోజులు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేసి, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చారని అన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిని మంత్రులు సత్కరించారు.

Advertisement