- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జగన్ తుగ్లక్ : గల్లా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక తుగ్లక్ అని లోక్‌సభ సాక్షిగా టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కామెంట్ చేశారు. ఇవాళ లోక్‌సభ సమావేశంలో రాజధాని అంశాన్ని గల్లా లేవనెత్తాడు. గల్లా ప్రసంగంపై వైసీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాజధాని అంశంపై మాట్లాడేందుకు గల్లాకు స్పీకర్ అనుమతి నిరాకరించాడు. అంసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ప్రస్తావించొద్దని స్పీకర్ గల్లాకు సూచించారు. అయినా గల్లా మాట్లాడుతూ.. విభజన చట్టంలో రాజధాని అంశం స్పష్టంగా ఉందని, కానీ రాష్ర్ట ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటోందని తెలిపారు. దేశంలో ఏ రాష్ర్టానికి మూడు రాజధానులు లేవనీ, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రతిపాదన తెచ్చిందన్నారు. 2015తో గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని తెలిపారు. రాజధాని అనేది రాష్ర్ట సమస్య కాదు. జాతీయ సమస్య అని, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం సరికాదని గల్లా తెలిపారు.