- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘విజయసాయిరెడ్డిని చెప్పుతో కొడితే తప్ప బుద్ధి రాలేదా’
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని దేవాలయాలపై సజ్జల చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత పట్టాభిరామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం వైసీపీదే అయినప్పుడు దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ఇంకా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చేయాల్సిన దుర్మార్గపు పనులు చేస్తూనే.. ప్రతి పక్షాల మీద ఆరోపణలు చేస్తావా అంటూ సజ్జలను నిలదీశారు. ఓ వైపు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుంటే.. రాష్ట్ర సీఎం దాడులు జరిగిన గుడులను ఎందుకు సందర్శించలేదన్నారు. పోలీసులను ఆధీనంలోనే పెట్టుకున్న ప్రభుత్వం దాడులకు పాల్పడిన ఏ ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చెప్పులతో దాడి చేస్తే తప్ప ప్రభుత్వానికి బుద్ధి రాలేదా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story