‘టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రానివ్వం’

by Anukaran |   ( Updated:2020-11-02 05:39:13.0  )
anilkumar yadav minister ap
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబుకు రిటైర్‌మెంట్ వయసు దాటింది.. ఆయన రెస్ట్ తీసుకుంటే మంచిదని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిగా లేకపోతే ఒక్క చంద్రబాబుకు తప్పా ఎవరికీ నష్టం లేదని విమర్శించారు. ఆయన ఆస్తి అంతా అమరావతిలోనే ఉందన్నారు. ఏపీలో ఏ సమస్య లేదు కాబట్టే.. ఆయన హైదరాబాద్‌లో హాయిగా ఉన్నారన్నారు. చంద్రబాబు పోతిరెడ్డిపాడు విస్తరణపై ఒక్కమాట మాట్లాడరు కానీ, పోలవరం పనులను 33 శాతం చేసి 70 శాతం చేసినట్టు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాకుండా చేయగల సత్తా సీఎం జగన్ కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

బీసీల సంక్షేమానికి వైసీపీ ప్రభత్వం తగు చర్యలు తీసుకుంటోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం గత 30 ఏండ్లుగా బీసీలను మోసం చేస్తూ వచ్చారని ఆరోపించారు. బీసీలను న్యాయం చేసిం కేవలం జగన్ మాత్రమే అంటూ మంత్రి అనిల్ కొనియాడారు.

Advertisement

Next Story