- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి చర్యలు మానుకోవాలి: గోరంట్ల
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. వైసీపీ చేస్తున్న పనుల కారణంగా.. ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందన్నారు. దీంతో పన్నులు వేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్రీ పాయింట్లకి పన్ను విధించడం అనేది శోచనీయమంటూ ఆయన ట్వీట్ చేశారు.
బ్రతుకుదెరువు కోసం కూరలు అమ్ముకునే వారి పై ఇలా వృత్తి పన్ను పేరిట రూ. 2500 విధిస్తూ జీవో నెంబర్ 664 విడుదల చేయడం అనేది అమానుషం అంటూ గోరంట్ల ఫైర్ అయ్యారు. అధికారం లోకి వచ్చి వివిధ రంగాల్లో చార్జీలు, నిత్యావసర ధరలు, ఇసుక, సిమెంట్, మద్యం ఇలా ఇష్టానుసారంగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచే కార్యక్రమాలు చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వ పథకాల వల్ల ఇచ్చే డబ్బు.. మళ్ళీ ఇలా ధరలు పెంచి తీసుకుంటున్నారని ఆరోపించారు. మరి ప్రజలకి మీరిచ్చిన సంక్షేమం ఎక్కడ? ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలు మానుకోవాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.