- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బూతుల మంత్రికి నోరుపారేసుకోవడమే తెలుసు : కొడాలి నానిపై చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు కొడాలి నానిని బూతుల మంత్రిగా అభివర్ణించారు. నోరు పారేసుకోవడం..పేకాట ఆడించడం తప్ప ఇంకేముందని నిలదీశారు. అడిగితే ఆడితే తప్పేముందు అంటూ సింపుల్ గా సమాధానం చెప్తాడంటూ మండిపడ్డారు. తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి దర్జాగా బయటకు వస్తాడు. అంటే సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా.? అని కొడాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకోవాలని లేని పక్షంలో విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరన్నారు. నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని వాపోయారు. పేదోళ్లకు కనీసం ఐదు రూపాయల భోజనం పెడుతుంటే… టీడీపీకి పేరొస్తుందనే భయంతో.. అన్నా క్యాంటీన్‌లను నిరుపయోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతా అన్న జగన్ ఇప్పుడేం చేస్తున్నాడని నిలదీశారు. ప్రత్యేక హోదా ఏమైంది? ఎవరికైనా న్యాయం జరిగిందా..? అని నిలదీశారు.
తమ పాలనలో నిరుద్యోగ భృతి ఇచ్చామని, ఇప్పుడు దాన్ని తీసేశారన్నారు. పెళ్లి కానుక రావడం లేదని చంద్రబాబు ఆరోపించారు. కార్యకర్తలపై సైతం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు సంఘీభావంగా ఇంటికో మనిషి రాలేరా? అని చంద్రబాబు ప్రజల్ని ప్రశ్నించారు. రాజధానిని తన కోసం కట్టుకున్నానా అని ప్రశ్నించారు. తాను పోరాడతుంటే మీరు సంఘీభావం తెలిపి ఇంట్లో ఉంటే సరిపోతుందా అని ప్రజల్ని చంద్రబాబు నిలదీశారు.