- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తా

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం కైకలూరు నియోజకవర్గంలో పర్యటించారు. గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ముంపు ప్రాంతాల్లో భారీగా పంటనష్టం జరిగింది. దీంతో బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పోరాడి తగిన నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
అంతేగాకుండా బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. కాగా ఇవాళ కృష్ణాజిల్లాతో పాటు, పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో లోకేష్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో లోకేష్‌కు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు.
Next Story