వైసీపీ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు : టీడీపీ

by srinivas |
వైసీపీ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు : టీడీపీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు నిర్ణయించారు. గత 13 నెలల కాలంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అలాగే తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు, తాజాగా చోటుచేసుకుంటున్న ఘటనలపై వారు రాష్ట్రపతికి వివరించనున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఏపీ పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాస్తోందని, రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడుల పేరుతో భయాందోళనకు గురిచేస్తున్నారని పేర్కొననున్నారు. అంతేకాకుండా, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను రాష్ట్రపతికి వివరించనున్నట్లు ఢిల్లీ టీడీపీ వర్గాలు తెలిపాయి.


Advertisement
Next Story

Most Viewed