ఏపీలో ఇది చీకటి రోజు: అనగాని సత్య ప్రసాద్

by srinivas |
ఏపీలో ఇది చీకటి రోజు: అనగాని సత్య ప్రసాద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు చీకటి రోజు అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని తరలింపుతో యువత భవిష్యత్తును నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని అనగాని డిమాండ్ చేశారు. అమరావతిని తరలించవద్దని ఇప్పటికీ రైతులు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేసిన ఆయన.. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకంగా.. రైతులకు మద్దతుగా ఉద్యమం చేపడుతామని అనగాని సత్య ప్రసాద్ తేల్చి చెప్పారు.


Advertisement
Next Story

Most Viewed