- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP Mahanadu: టీడీపీ మహానాడుపై చంద్రబాబు కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో ఈ సారి కూడా డిజిటల్ వేదికగా మహానాడు నిర్వహించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో వెల్లడించారు. మే 27,28వ తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడు జరుగుతుందని, వైసీపీ రెండేళ్ల పాలన, అప్పులు, స్కాములు, తదితర అంశాలపై తీర్మానం చేయనున్నామన్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశనం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాం(1/2)
— N Chandrababu Naidu (@ncbn) May 26, 2021
అందరూ కలిసి వచ్చి డిజిటల్ మహానాడుని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో గత సంవత్సరంలాగే.. ఈ సంవత్సరం కూడా వర్చువల్ ద్వారా మహానాడు నిర్వహించనున్నారు.
మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో జరిగే '#DigitalMahanadu2021'లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు.. తదితర అంశాలపై తీర్మానం చేయనున్నాం. అందరూ కలిసి రండి. 'డిజిటల్ మహానాడు 2021'ను విజయవంతం చేయండి(2/2)
— N Chandrababu Naidu (@ncbn) May 26, 2021