- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్జీ పాలిమర్స్ కోసం జగన్ పని చేస్తున్నారు: టీడీపీ నేతలు
దిశ ఏపీ బ్యూరీ: విశాఖపట్టణంలోని వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పాలిమర్స్ యాజమాన్యానికి కొమ్ముగాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే…
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని లోకేశ్ హితవు పలికారు. ఎలాంటి మెడికల్ క్యాంపులు లేవు, షెల్టర్లు లేవు, అంతా కలుషితం అయిపోయింది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మా సమస్యలు పరిష్కరించండి అని స్థానిక యువత ఆందోళన తెలుపుతుంటే వారిని అడ్డుకొని కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం మంచిది కాదంటూ ట్విట్టర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రంగా ఉంటే సీఎం జగన్ గారు రూ.పది కోట్లు ఇస్తాం, రూ.30 కోట్లు ఇస్తామని చెప్పి డబ్బుతో లెక్క చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్థానిక యువత ఆవేదనను సీఎం అర్థం చేసుకోలేక పోవటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై అచ్చెన్నాయుడు, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ…
ముఖ్యమంత్రి పర్యటనలో కొంత తేడా కనపడిందని అన్నారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఆయన దిగిన వెంటనే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు కలిశారని ఆరోపించారు. దీనిపై అభ్యంతరాలున్నాయంటూ, దీంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం విశాఖకు రావడంతో ప్రజలకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారని ఆయన చెప్పారు. అయితే, ఆయన పర్యటన జరిగిన తీరు చూస్తే బాధేసిందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ లీక్ బాధితులను కలిసి పరామర్శించకముందే పరిశ్రమ ప్రతినిధులను ఆయన కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు అధిక పరిహారం ప్రకటించడం సంతోషకరమైన విషయమేనని చెప్పారు. అయితే, ఆ పరిహారం ఎవరు ఇస్తారని ప్రశ్నించారు.
మృతులకు జగన్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారని, అయితే, ఆ రూ.కోటి ప్రభుత్వం ఇస్తుందా? లేక కంపెనీ యాజమాన్యం ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఒకవేళ కంపెనీ ఈ పరిహారాన్ని ఇస్తే ఇంతకు పదిరెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన సూచించారు. గ్యాస్ లీక్ తర్వాత పరిశ్రమను విశాఖ నుంచి తరలిస్తామని సీఎం ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు.
గ్యాస్ లీక్‌పై దేవినేని ఉమ మాట్లాడుతూ…సునామీ, హుద్ హుద్ , తిత్లీలను తట్టుకొన్న విశాఖలో నేడు ఎల్జీ కంపెనీ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ప్రజలు గ్రామాలు వదిలి భయం గుప్పెట్లో రోడ్లపై గడుపుతున్నారు. రాజప్రాసాదాల్లో ఉన్న నాయకులారా మీకు కనిపించడం లేదా పునరావాసం, ప్రభుత్వ సాయం అందించాలని? ఈ విషయాన్ని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి అంటూ ట్విట్టర్ మాధ్యమంగా నిలదీశారు.