టీడీపీ సభ్యులు మళ్లీ సస్పెండ్

by srinivas |
టీడీపీ సభ్యులు మళ్లీ సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో సభకు అడ్డుపడుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారం టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సభలోని 9 మంది టీడీపీ సభ్యులు .. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, బి.అశోక్, అనగాని సత్యప్రసాద్, రవికుమార్, సాంబశివరావు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబులను ఒక రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వరుసగా మూడో రోజు కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed