జూరాలను రీడిజైన్ చేయండి : కొత్తకోట

by Shyam |
జూరాలను రీడిజైన్ చేయండి : కొత్తకోట
X

దిశ, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి నీటి సామర్థ్యాన్ని పెంచాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల నియంత్రణ విషయం ప్రకటించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొందరపడ్డారని అన్నారు. అలా ప్రకటించే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములన్నింటినీ భూసార పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు కార్తెలను చూసి పంటలు వేయడం అలవాటని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం సోనా మసూరి మాత్రమే పండించాలని అనడం సబబు కాదని రైతులకు ఇష్టం వచ్చిన పంటలను వారు పండించుకుంటారని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లతో మీ కుమ్మక్కు రాజకీయాలు అన్నీ తెలుసునని విమర్శించారు. మిగతా వరి వంగడాలతో పోలిస్తే తెలంగాణ సోనా మసూరి రకం తూకం తక్కువగా వస్తుందని ఈ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇబ్బడి ముబ్బడిగా కాటన్ పండిస్తే అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఈ విషయం గతంలో అమ్మకాల విషయంలో అర్థం అయి ఉండాలని అన్నారు. జిన్నింగ్ మిల్లుల కెపాసిటీ చాలా తక్కువగా ఉందని వాటికి వర్సిటీని వెంటనే పెంచాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed