వైఎస్ వివేకా హత్యపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

by srinivas |
TDP leader Varla Ramaiah
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద హ‌త్యకేసు విచారణపై అసహనం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చాక ముద్దాయిల‌ను ప‌ట్టుకుంటామ‌ంటూ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం జగన్! మీ బాబాయి వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకులను సీబీఐ ఇంకా పట్టుకోలేదని బాధ పడుతున్నారా? ఇప్పటి సీబీఐ అసలు ముద్దాయిలను పట్టుకొని మిమ్ము సంతోష పెట్టలేకపోతే రేపు మేము అధికారంలోకి వస్తాం, తప్పక మీ బాబాయిని నరికి చంపిన అసలు ముద్దాయిలను పట్టుకుంటాం, వాస్తవాలు ప్రజల ముందుంచుతాం. ఓకేనా?’ అంటూ వ‌ర్ల రామయ్య పోస్ట్ పెట్టారు.


Next Story