‘మంత్రి జయరాం భూ బకాసురుడు’

by Anukaran |
‘మంత్రి జయరాం భూ బకాసురుడు’
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జయరాంపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం అయ్యన్న మీడియాతో మాట్లాడుతూ… మంత్రి జయరాం భూ దందాలకు పాల్పడ్డారని విమర్శించారు. బినామీల పేరుతో 203 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడించారు. మంత్రి జయరాం భూ బకాసురుడు అని ఆరోపించారు. మంత్రి అక్రమాలపై ఏసీబీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. భూములు, ఈఎస్ఐ నిధుల మళ్లింపు, బెంజ్ కారు ఆరోపణలపై విచారణ జరిపించాలని అయ్యన్న ప్రభుత్వాన్ని కోరారు. జయరాం అవినీతిపై సీఎం జగన్ స్పందించకపోతే, ఇందులో సీఎం పాత్ర కూడా ఉందని అనుమానించాల్సి వస్తుందని సూచించారు.

Advertisement

Next Story