సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడిన లోకేశ్.. ఏమన్నాడంటే ?

by Ramesh Goud |
nara
X

దిశ, ఏపీ బ్యూరో: హీరో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆకాంక్షించారు. పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగిరావాలని కోరారు. సాయిధరమ్ తేజ్…నువ్వు మునుపటి ఉత్సాహం, తరగని శక్తితో తిరిగి రావాలని మేమందరం ప్రార్థిస్తున్నాం అంటూ ట్విటర్ వేదికగా లోకేశ్ ఆకాంక్షించారు. శుక్రవారం రాత్రి 8:05 గంటలకు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ అయిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సాయిధరమ్ తేజ్ చికిత్సకు స్పందించారు. ఈ ఘటనలో సాయి ధరమ్ తేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed