- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాక్షాత్తూ ప్రధానే వద్దన్నా జగన్ వినట్లే : నారా లోకేష్
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ (సీబీఎస్ఈ) 12వ తరగతి, సీఐఎస్‌ఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్షల కంటే పిల్లల భవిష్యత్తు, భద్రతే ముఖ్యమని ప్రధాని భావించారని, అంతేకాకుండా విద్యార్థులు ఇష్టంగా పరీక్షలు రాయడానికి సిద్ధపడితేనే అనుమతివ్వాలని, విద్యాసంస్థలు బలవంతంగా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేయరాదని మోడీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నారా లోకేశ్ గుర్తుచేశారు.
మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, పరీక్షలు రద్దు చేయాలని ఎన్నిమార్లు కోరినా వినిపించుకోవడం లేదని మండిపడ్డారు. సాక్షాత్తు ప్రధానే విద్యార్థుల జీవితాలతో ఆటలాడోద్దని చెప్పారని, థర్డ్ వేవ్ పొంచియున్న తరుణంలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం మొండిపట్టు పట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో 10శాతం మంది పిల్లలు వైరస్ బారిన పడ్డారని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే పరిస్థితి ఎంటనీ నారాలోకేశ్ అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పరీక్షలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.