‘గాలి మాటలు ఆపి రైతులను ఆదుకోండి’

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్ని దళారులు నిలువు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. మద్దతు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పుట్టి ధాన్యానికి రూ.8 వేల ధర కూడా లభించడం లేదని చెబుతున్న ఓ రైతు వీడియోను నారా లోకేశ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఈ సందర్భంగా.. పుట్టి ధాన్యానికి రూ.16వేల కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని వైఎస్ జగన్ గాలిమాటలు చెబుతున్నారని విమర్శలు చేశారు. క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.

Advertisement