‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్ రెడ్డి ముఖ్యమంత్రా..?’

by srinivas |
‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్ రెడ్డి ముఖ్యమంత్రా..?’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రామతీర్థం రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వైసీపీ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే దీనిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనను టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్రంగా ఖండించారు. అంతేగాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీకి ముఖ్యమంత్రి ఎవరు. దళితుల నుంచి దేవుళ్ళ వరకు ఎన్ని దాడులు జరిగినా స్పందించని జగన్ రెడ్డి ముఖ్యమంత్రా..?, లేక అయిన దానికి కాని దానికి కారుకూతలు కూసే విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రా..?’’ అని మండిపడ్డారు. దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story