ఆ ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసింది: గంటా

by srinivas |
ఆ ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసింది: గంటా
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్‌ కూలి 10 మంది మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని టీడీపీ నేత గంటా శ్రీనివాస్ అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మక షిప్ యార్డ్ లో ఇలా జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోందని.. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలియజేశారు.

మరణించిన వాళ్లంతా ఒప్పంద కార్మికులే అని గుర్తు చేసిన గంటా.. వాళ్ళ కుటుంబాలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు వారి భవిష్యత్ కూ భరోసా ఇవ్వాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదానికి దారితీసిన సంఘటనలపై విచారణ చేయించి వైఫల్యాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలతో ప్రజల్లో భయాందోళన నెలకొని ఉందన్నారు. వాటిల్ని పారద్రోలి, పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అంటూ గంటా శ్రీనివాస్ గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed