‘గజాననా ఏమిటీ ఘోరం’

by srinivas |
‘గజాననా ఏమిటీ ఘోరం’
X

దిశ, వెబ్‌డెస్క్: గజాననా ఏమిటీ ఘోరం.. వినాయక విగ్రహానికి మలం పూసిన అరాచక శక్తుల వెనుక ఉన్నదెవరు.. ప్రజల మనోభావాలతో ఆటలా.. ప్రభుత్వం ఏం చేస్తోంది.. అంటూ టీడీపీ నాయకులు దేవినేని ఉమ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుసగా దుస్సంఘటనలు, అలజడులు సృష్టిస్తోన్నాయి. రాజమహేంద్రవరం రూరల్ వేంకటగిరి గ్రామంలో వినాయక విగ్రహాన్ని అపవిత్రం చేసిన దుండగులు, అరాచకశక్తులు ఇలా రెచ్చిపోతోంటే ప్రభుత్వం ఏంచేస్తోంది వైఎస్ జగన్.. వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement
Next Story

Most Viewed