రాక్షసుల్లా వైసీపీ నేతలు : చంద్రబాబు

by srinivas |   ( Updated:2020-03-11 04:42:36.0  )
రాక్షసుల్లా వైసీపీ నేతలు : చంద్రబాబు
X

టీడీపీ నేతల కారుపై పెద్ద పెద్ద కర్రలతో వైసీపీ నేతలు దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసి లోపల ఉన్న వారిపైనా దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెట్రేగిపోతున్నాయన్నారు. పులివెందులలో పోలీసులే టీడీపీ నేతలు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటూ ప్రభుత్వానికి తొత్తులుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు రాక్షసుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని, దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చంద్రబాబునాయుడు తెలిపారు.

tags : TDP leader chandrababu nayudu, fire, ycp leaders, palnadu, dgp, Car mirrors destroyed


Next Story

Most Viewed