వర్ల రామయ్య కుటుంబానికి రక్షణ కల్పించాలి

by srinivas |
వర్ల రామయ్య కుటుంబానికి రక్షణ కల్పించాలి
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలతో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైందన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని తెలిపారు. వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్‌పై సమగ్ర విచారణ జరపాలని వెల్లడించారు. వర్ల రామయ్య కుటుంబానికి భద్రత రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed