జగన్‌కు పబ్లిసిటి పిచ్చి

by srinivas |
జగన్‌కు పబ్లిసిటి పిచ్చి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమ ఫైర్ అయ్యారు. ఎప్పుడూ జరగని విధంగా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. జగన్‌కు పబ్లిసిటి పిచ్చి పట్టిందని, ఆయన చెప్పే దిశ చట్టం, స్పందన యాప్‌లు మహిళలను కాపాడలేకపోతున్నాయని మండిపడ్డారు. గుంటూరు జిల్లా నకిరేకల్‌లో మహిళను వైసీపీ నేత ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుడు కాబట్టే అతనిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దిశ చట్టం, రక్షాబంధన్‌ పేరిట క్షేత్రస్థాయిలో పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప మహిళకు న్యాయం ఎక్కడ జరుగుతుందో చెప్పాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed