- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్లు తెరవండి.. తక్షణమే ధాన్యం కొనండి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు..
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు డిమాండ్ చేస్తూ.. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అండగా ఉండటం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. అధికారం అనుభవించడమే కాదు.. బాధ్యతలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై తమ బాధ్యత తప్పించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ గేమ్ ఆడటం మానుకోవాలని సూచించారు.
వ్యవసాయం ఉమ్మడి బాధ్యత అయినప్పుడు రైతులను ఆదుకోవడం ఉమ్మడి బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు మానుకొని రైతు సంక్షేమం, ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించాలన్నారు. తేమ, తరుగు పేరుతో దోపిడీ అని అరికట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండ ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు వినతులు అందజేశామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడతామని బక్కని నర్సింహులు హెచ్చరించారు.
- Tags
- bjp
- blame game