బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలు లేవనెత్తుదాం: టీడీపీ

by srinivas |
బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలు లేవనెత్తుదాం: టీడీపీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసందే. గత కొంతకాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు వ్యతిరేకంగా బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ భావించింది. ఈ మేరకు వార్తా కథనాలు కూడా వచ్చాయి. అయితే, రేపు ప్రారంభంకానున్నా బడ్జెట్ సమావేశాలకు టీడీపీ హాజరుకావాలని టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కేవలం రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సెషన్‌లో వైఎస్సార్సీపీని మూడు చెరువుల నీరుతాగించాలని నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం తరువాత జరిగే ధన్యవాదాలు తెలిపే క్రమంలో తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులు, ఎల్జీ పాలిమర్స్ ఘటన, మద్యం ధరలు, ఇసుక మాఫియా తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీఎల్పీ నిర్ణయించింది.

టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందించాలని కూడా నిర్ణయించింది. వైఎస్సార్సీపీ బిల్లులు ఆమోదించుకోవాలన్న ప్రయత్నంలో వాగ్వాదాన్ని మరింత కొనసాగిస్తే ఆ పార్టీని దెబ్బకొట్టినట్టేనని టీడీపీ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed