- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జగన్‌ను చూస్తుంటే సైకో అనిపిస్తుంది: చంద్రబాబు

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌తో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎప్పుడూ లేనంతగా వరదలు వచ్చి లక్షల ఏకరాల్లో పంట నష్టం జరిగితే.. వైసీపీ నాయకులు గాలి మాటలు మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ నుంచి బయటకొచ్చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. వరదల్లో రైతులు, కూలీలు దెబ్బతిన్నారని.. దీనిపై ప్రశ్నించినందుకు అప్పులు కట్టామని చెప్పడం సరికాదన్నారు. టీడీపీ ఐదేళ్లలో చేసిన అప్పులను వైసీపీ ఏడాదిలోనే చేశారన్నారు. అటువంటి వైసీపీ నేతలు అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అన్ని అవాస్తవాలను పరిగణలోకి తీసుకొని గాలి కబుర్లు చెబుతున్నారన్నారు. జగన్‌ను చూస్తుంటే ఓ సైకోనా అని అనుమానం కలుగుతోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Next Story