- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎఫ్‌పై వచ్చే వడ్డీకి ట్యాక్స్!
న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాలో జమ చేస్తే వడ్డీపై పన్ను రాయితీ ఉంటుందన్న భరోసాకు కాలం చెల్లింది. ఏడాది కాలంలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్లు రూ. 2.50 లక్షల పరిమితిని దాటితే పన్ను బాదుడుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం కల్పించిన భవిష్య నిధి(పీఎఫ్) ఖాతాల్లో ఎంత జమచేసుకున్నా పన్ను రాయితీ అవకాశముంది. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 10లో క్లాజు(11), (12)ల కింద పీఎఫ్ ఖాతాలో జమ చేసుకున్న మొత్తానికి లభించే వడ్డీపై పన్ను రాయితీకి అవకాశమున్నది. ఈ క్లాజుల కిందనే ఇప్పటి వరకు ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసుకున్న మొత్తానికి వచ్చే వడ్డీపై పూర్తి రాయితీని కల్పించింది. అయితే, కొందరు అధికమొత్తాల్లో వేతనాలు అందుకుంటున్నవారు దీన్ని లొసుగుగా ఉపయోగించుకుని పీఎఫ్ ఖాతాల్లోకి వాలంటరీగా భారీ మొత్తాలను జమ చేస్తున్నారని, ఫలితంగా పన్ను రాయితీని పొందుతున్నారని కేంద్రం ఉటంకించింది. అందుకే పీఎఫ్ ఖాతాల్లో ఏడాదికి రూ. 2.50 లక్షలకు పైగా జమచేస్తే ఆ మొత్తానికి వచ్చే వడ్డీపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి(ఏప్రిల్ 2021 నుంచి) పన్ను విధించనున్నట్టు బడ్జెట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిమితికి మించి జమ చేసిన మొత్తాలపై సదరు ఖాతాదారుడి ఆదాయానికి విధిస్తున్న రేటులోనే పన్ను విధించనుంది.
మూల వేతనంలో 12శాతం ఈపీఎఫ్‌కు కేటాయిస్తారు. ఈ మొత్తాన్ని 100శాతానికి పెంచుకునే వెసులుబాటూ ఉన్నది. పెంచుకున్న మొత్తాన్ని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(వీపీఎఫ్)గా పరిగణిస్తారు. వీపీఎఫ్‌కు కూడా సెక్షన్ 80 సీ కింద రాయితీ ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై వడ్డీరేటు 8.5శాతంగా అమలవుతున్నది. నిజానికి 2018-19లో ఇది 8.65శాతం ఉండగా 2019-20లో దీన్ని 8.5శాతానికి కేంద్రం తగ్గించింది.