‘టాటా’కు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్ట్

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను టాటా గ్రూప్ దక్కించుకుంది. కేంద్ర‌ ప్ర‌జాప‌నుల శాఖ బుధవారం నిర్వహించిన బిడ్డింగ్‌లో ఎల్‌అండ్‌టీ, టాటా కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకునేందుకు పోటీ పడగా.. చివరకు టాటాకు అవకాశం దక్కింది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.940 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. అయితే అంచనా ప్రకారం టాటా ప్రాజెక్ట్ రూ.861 కోట్లకు బిడ్డింగ్ వేయగా.. ఎల్‌అండ్‌టీ రూ.865 కోట్లకు పార్లమెంట్ నిర్మిస్తాయని చెప్పాయి. దీంతో కేంద్రం త‌క్కువ వ్య‌యంతో పార్ల‌మెంట్ ను నిర్మించేందుకు ముందుకు వ‌చ్చిన టాటా కంపెనీకి ఈ ప్రాజెక్ట్‌ను అప్పగించింది. ఇప్పుడున్న పార్లమెంట్ భవనానికి సమీపంలోనే కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనుండగా.. 21 మాసాల వ్యవధిలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement