పెరిగిన టాటా మోటార్స్ అమ్మకాలు

by  |
పెరిగిన టాటా మోటార్స్ అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సవాళ్లను ఎదుర్కొని దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (TATA Motors) ఆగష్టు నెలకు మొత్తం అమ్మకాల్లో 13.4 శాతం పెరిగి 36,472 యూనిట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో మొత్తం 32,166 యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

అలాగే, దేశీయ అమ్మకాలు 21.6 శాతం పెరిగి 35,420 యూనిట్లకు చేరుకున్నాయని, గతేడాది ఆగష్టులో టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు 29,140 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది. దేశీయ మార్కెట్లో ఆగష్టు నెలకు ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు రెండు రెట్లు పెరిగి 18,583 యూనిట్లకు చేరుకున్నాయి.

ఇవి గతేడాది ఇదే నెలలో 7,316 యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. కాగా, మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఆగష్టు నెలకు 28 శాతం క్షీణించి 17,889 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఆగష్టులో మొత్తం ప్యాసింజర్ వాహనాలు 24,850 యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది.


Next Story

Most Viewed