- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.4,451 కోట్ల నష్టాలను చవిచూసిన టాటా మోటార్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా రూ. 4,451 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సైతం కంపెనీ రూ. 8,438 కోట్ల నికర నష్టాలను చవిచూసింది. అయితే, ఈసారి విశ్లేషకుల అంచనాలకు మించి మూడు రెట్లకు పైగా నష్టాలను ఎదుర్కొన్నది. సమీక్షించిన త్రైమాసికంలో టాటా మోటార్స్ ఆదాయం 107.6 శాతం పెరిగి రూ. 66,406 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫలింగ్‌లో తెలిపింది. జూన్ మొదటి త్రైమాసికంలో మెరుగైన పనితీరు కారణంగా ఆదాయం సానుకూలంగా ఉందని కంపెనీ అభిప్రాయపడింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లలో పలు ప్రాంతాలు లాక్‌డౌన్ ఆంక్షలను ఎదుర్కొన్నాయని కంపెనీ వివరించింది.
సంస్థ ప్రీమియం కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ వార్షిక ప్రాతిపదికన 73.7 శాతం ఆదాయాన్ని పెంచుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో అమ్మకాలు పెరిగాయని కంపెనీ పెర్కొంది. అయితే, సెమీకండక్టర్ల కొరత కారణంగా కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని తెలిపింది. కాగా, సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్లు 1 శాతం తగ్గి రూ. 292.75 వద్ద ట్రేడయింది.