‘ఆటో పరిశ్రమకు కొత్త సవాళ్లు’

by  |
‘ఆటో పరిశ్రమకు కొత్త సవాళ్లు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభ దశలో ఆటో పరిశ్రమ (Auto industry)కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని టాటా మోటర్స్ (Tata Motors) ఎండీ, సీఈవో గ్యుంటర్ బషెక్ అన్నారు. ప్రస్తుతం ఆటో పరిశ్రమ ఇప్పుడిప్పుడే తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. పెరుగుతున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కోవాల్సి ఉంది. లాక్‌డౌన్ ముగిసింది అంటే కరోనాకు ముందు నాటి పరిస్థితిలో ఉన్నామని కాదు, రానున్న రోజుల్లో అడపాదడపా అంతరాయాలు, ఆటంకాలు తప్పవు అని ఆయన వెల్లడించారు.

కొవిడ్-19 (Kovid-19) ప్రభావం పరిశ్రమలో అనూహ్యమైన డిమాండ్‌ను ముందుకు తెచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరం (Financial year) బీఎస్4 (BS4) నుంచి బీఎస్6 (BS6) కి మారుతున్న క్రమంలో కరోనా దెబ్బతీసిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరిలో తక్కువ కార్యకలాపాలు నిర్వహించిన కారణంగా డిమాండ్ క్షీణించిందని, దీని ప్రభావం దారుణంగా ఉందన్నారు. కరోనా సంక్షోభం సమయంలో వాహన తయారీదారుల (vehicle manufacturers)కు సరఫరా వ్యవస్థలో తీవ్రమైన అంతరాయాలు ప్రధాన సమస్యగా ఉన్నట్టు గ్యుంటర్ చెప్పారు.

నిధుల సమస్యలకు తోడు, డిమాండ్ మందగించడం మరింత ఒత్తిడిని కలగజేస్తుందన్నారు. ‘మారిన పరిస్థితులకు అనుగుణంగా సరఫరాదారులు, వ్యూహాత్మక భాగస్వాములు, ఒరిజినల్ పరికరాల తయారీదారుల ప్రాధాన్యత సమానంగా ఉండాలని, కలిసి పనిచేయాలని’ ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ (Economy) తిరిగి ప్రారంభమైన తర్వాత నుంచి గత రెండు నెలల్లో పరిశ్రమ అనుబంధ రంగాల్లో సానుకూల ధోరణి కనిపిస్తోందన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ (Atmanirbhar Bharat)లో భాగంగా భారత మార్కెట్‌ను గ్లోబల్ హబ్‌ కేంద్రంగా మార్చడంలో ఆటో కాంపొనెంట్ తయారీదారులు (Auto component manufacturers) కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు.


Next Story

Most Viewed