- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
250 కొత్త ఔట్‌లెట్లు ప్రారంభించనున్న టాటా మోటార్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ రానున్న రోజుల్లో కొత్త మోడళ్లను తీసుకురావాలని, అమ్మకాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని భావిస్తోంది. దేశీయ మార్కెట్లో ఉన్న అధిక పోటీని తట్టుకుని తన రెండంకెల మార్కెట్ వాటాను కొనసాగించాలని సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇటీవల కంపెనీ తెచ్చిన నెక్సాన్, హారియర్, కొత్త సఫారీ మోడళ్లతో తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్ విభాగంలో 10 శాతానికి పైగా మార్కెట్ వాటా సాధించింది. దీన్ని ఇలాగే కొనసాగించాలని కంపెనీ యోచిస్తోంది.
అదనపు వాల్యూమ్‌లను తీసుకురావడానికి, ఎక్కువమంది వినియోగదారులను దక్కించుకోవడానికి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి టాటా మోటార్స్ దాదాపు 250 కొత్త సేల్స్ ఔట్‌లెట్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయ్యాయి. 10.3 శాతం మార్కెట్ వాటాను దక్కించుకున్నాము. హార్న్‌బిల్ సహా రెండు పెద్ద వాహనాలను లాంచ్ చేయాలనుకుంటున్నాం. అంతేకాకుండా, కొత్త ఆవిష్కరణలతో పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేయాలని భావిస్తున్నామని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అధ్యక్షుడు శైలెష్ చంద్ర చెప్పారు. భవిష్యత్తులో ఇదే మాదిరిగా డబుల్ డిజిట్ మార్కెట్ వాటాను కొనసాగించాలనే ఆకాంక్షను కలిగి ఉనట్టు కంపెనీ వెల్లడించింది.