TATA మోటార్స్ నుంచి సరికొత్త వేరియంట్స్..

by Harish |
harrior
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ వాహనాలైన హారియర్, సఫరా మోడళ్లలో ‘ఎక్స్‌టీఏ ప్లస్’ వేరియంట్లను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లు 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తాయని కంపెనీ వెల్లడించింది. హారియర్ ‘ఎక్స్‌టీఏ ప్లస్’ రూ. 19.14 లక్షల నుంచి అందుబాటులో ఉంటుందని, హారియర్ ‘ఎక్స్‌టీఏ ప్లస్’ డార్క్ ధర రూ. 19.34 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిపింది. అలాగే, టాటా సఫారి ‘ఎక్స్‌టీఏ ప్లస్’ ధర రూ. 20.08 లక్షలుగా నిర్ణయించినట్టు పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హారియర్, సఫారీ మోడళ్లు దేశీయ ఎస్‌యూవీ విభాగంలో 41.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నాయని, ‘ఎక్స్‌టీఏ ప్లస్’ వేరియంట్ ద్వారా మరింత మంది వినియోగదారులను సాధించనున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. మార్కెట్లో కంపెనీ పోర్ట్‌ఫోలియో బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త ‘ఎక్స్‌టీఏ ప్లస్’ వేరియంట్లలు 2.0 డీజిన్ ఇంజిన్‌తో లభిస్తాయని, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, డ్యుయెల్ ఫంక్షన్ ఎల్ఈడీ, అలాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమెంటి టెంపరేచర్ లాంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో జోడించినట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed