కరోనా కట్టడికి మరిన్ని టెస్టులు చేయాలి : టాటా గ్రూప్ ఛైర్మన్

by Harish |
కరోనా కట్టడికి మరిన్ని టెస్టులు చేయాలి : టాటా గ్రూప్ ఛైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు పెరుగుతున్న కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ధారణ పరీక్షలను పెంచాలని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని, తగిన వ్యూహాన్ని అనుసరిస్తూ కొవిడ్-19ను నియంత్రించలేమని ఆయన స్పష్టం చేశారు. టాటా గ్రూప్ కంపెనీ న్యూస్ లెటర్‌లో ఎన్. చంద్రశేఖరన్ ప్రస్తుత పరిస్థితులపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనుకోకుండా వ్యాప్తి చెందిన కరోనా వల్ల ఊహించని స్థాయిలో పీపీఈ కిట్‌లకు డిమాండ్ పెరిగిపోయిందని, వీటి తయారీకి అవసరమైన వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.

శాంపిళ్లను సేకరించడం, వాటిని తరలించడం, పరీక్షించడానికి తగిన సిబ్బంది..ఇలా అన్ని అంశాల్లో టాటా గ్రూప్ సరైన నిర్ధారణ పరీక్షలను చౌకగా చేసిందని చంద్రశేఖరన్ లేఖలో వెల్లడించారు. గత ఆరు నెలల్లో ఎన్నో విషయాల్లో ఆటంకాలను ఎదుర్కొన్నామన్నారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవాలను ఎన్ని చెప్పినా తక్కువే అవుతాయని, కానీ ఆటంకాలను అధిగమించేందుకు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, పరిష్కారం కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడం లాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయని చంద్రశేఖరన్ వివరించారు. కరోనా సంక్షోభంలో సంస్థకు అండగా ఉన్న టాటా గ్రూప్ సిబ్బంది పనితీరుకు గర్వపడుతున్నానని తెలిపారు.

Advertisement

Next Story