- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదల కోసం టాస్క్ గైడెన్స్ సెల్
దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పేదల కోసం తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) కెరీర్ గైడెన్స్ సెల్ ను ఆదివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఆదివాసి యువత కూడా సరైన సదుపాయాలను కల్పిస్తోందన్నారు. ట్రైబల్ యువతకు టాస్క్ ద్వారా ఎంపవర్మెంట్ దొరుకుతుందన్నారు.
అనంతరం టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ.. యువత కోసం ప్రత్యేక కెరీర్ గైడెన్స్ కోసం హాట్ లైన్ నంబర్ ను లాంఛ్ చేస్తున్నట్లు చెప్పారు. కెరీర్ గైడెన్స్ కోసం 040-48488241 నంబరుకు కాల్ చేయాలని, నిపుణులు సలహాలిస్తారన్నారు. ఈ హెల్ప్ లైన్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోమవారం నుంచి శనివారం వరకు పని చేస్తుందన్నారు.