- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇవాళ మధిరలో ఇది జరిగింది
by Sridhar Babu |
దిశ, ఖమ్మం: సరైన బిల్లులు లేకుండా ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో కొంతమంది సిగెరెట్, బీడీ, ఇతర వస్తువులను విక్రయిస్తున్నారన్న సమాచారంతో కిరాణా దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి బిల్లులు లేకుండా సిగరెట్లు, బీడీ ప్యాకెట్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న నాలుగు దుకాణాలను సీజ్ చేశారు. ఈ నాలుగు షాపుల నుంచి సుమారు రూ. 20 లక్షల మార్కెట్ విలువ చేసే వివిధ బ్రాండ్‌ల సిగరెట్, బీడీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు మాట్లాడుతూ మధిర పట్టణంలోని గల్లపాటి కొండా, జితేపల్లి కృష్ణారావు, బి.రవికుమార్, పుల్లారావు షాపులను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.
Next Story