భీంగల్‌లో భారీగా మద్యం, నగదు పట్టివేత

by Sumithra |
భీంగల్‌లో భారీగా మద్యం, నగదు పట్టివేత
X

దిశ, నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ పట్టణ కేంద్రంలో రెండు మద్యం దుకాణాల యజమానుల ఇండ్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించి భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ సీపీ కార్తీకేయ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని లక్ష్మీనర్సింహ వైన్స్, ఎస్‌ఎల్‌ఎన్ మద్యం దుకాణాల యజమానుల ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి 24 మద్యం బాటిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దుర్కి రాకేశ్, జవ్వాజీ అరుణ్ అనే వ్యక్తితో కలిసి మద్యం అమ్ముతున్నట్టు గుర్తించి, అతని ఇంటిపై కూడా దాడులు నిర్వహించగా.. లాక్‌డౌన్ వేళలో అమ్మిన మద్యానికి వచ్చిన రూ.5.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసుకుని భీంగల్ పోలీసులకు అప్పగించినట్టు నరేందర్ తెలిపారు.

Tags: task Force police, raid, liquor shops, nizamabad, cp karthikeya

Advertisement
Next Story