- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ కథనం.. మట్కా అడ్డాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు

X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ‘ఆన్ లైన్ మట్కా మాయా’ పేరుతో ఈ నెల 2న వచ్చిన ‘దిశ’ పేపర్‌లో వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. నిజామాబాద్ సీపీ కార్తీకేయ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో మూడు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దాడులు నిర్వహించారు. నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని 4 బుకీలను, 2 మట్కా బీటర్లను పట్టుకుని వారివద్ద రూ.4200లను 3 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. రెండో టౌన్ పరిధిలోని ఇద్దరు బుకీలను పట్టుకుని వారివద్ద నుంచి రూ.4100లను, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. త్రీ టౌన్ పరిధిలోని ఒక బుకీని పట్టుకుని అతని వద్ద రూ.1900 లను ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మట్కా రాయుళ్లను ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సీపీ కార్తీకేయ తెలిపారు.
Next Story