కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్​ఫోర్స్​

by srinivas |
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్​ఫోర్స్​
X

దిశ, ఏపీ బ్యూరో : కొవిడ్ వ్యాక్సిన్ ను తొలుత అర్బన్​ ప్రాంతాల్లో పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అర్బన్ ​టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ కమిషనర్‌ చైర్మన్‌గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఈపాటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. రాష్ర్ట టాస్క్ ఫోర్స్ లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పిస్తూ ఉత్తర్వుల్లో సవరణ చేసింది. జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో మరో 31 మంది అధికారులు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. కొత్త సవరణలతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా 16 మంది, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సభ్యులుగా 34 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed