- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హలీం, హరీస్ తయారీ కేంద్రాలపై దాడి
దిశ, కరీంనగర్:
రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా అనుమతి లేకుండా హరీస్, హలీంలను తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. కరీంనగర్ లోని ఫతేపురా, గోదాంగడ్డ ప్రాంతాల్లో అక్రమంగా హలీం, హరీస్ పదార్థాలు తయారు చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ ఫతేపురాకు చెందిన సయ్యద్ ఖదీర్(59), అతని కుమారులు ముదస్సర్( 27), అబ్రత్కా వలి( 21) రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం నుండి రహస్యంగా ప్రత్యేక వంటకాలు తయారు చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల రాత్రి వేళల్లో బయటకు వచ్చే అవకాశం లేనందున ఇఫ్తార్ తరువాత ఆహారంగా తీసుకునే హరీస్, హలీం పదార్థాలను ఫోన్ ద్వారా ఆర్డర్ తీసుకొని డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ విభాగం పోలీసులు రహస్యంగా హలీం, హరీస్ తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ కేంద్రాల నుండి 75 కిలోల మాంసం కీమా, హరీస్ తయారు కోసం వినియోగించే ఇతర సరుకులు, సామాగ్రిని స్వాధీనం చేసుకొని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అలాగే గోదాంగడ్డ ప్రాంతంలోని ఒక ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో రహస్యంగా హలీం తయారు చేస్తున్న కేంద్రం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సంజయ్ నగర్ కు చెందిన షేక్ ఫరీద్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత సంబంధిత బ్లూ కోట్ పోలీసులకు సమాచారం అందించారు. నిర్వాహకుడు ఫరీద్ పై టూ టౌన్ లో కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ విభాగం ఇన్ స్పెక్టర్ రత్నాపురం ప్రకాష్, శశిధర్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ నరసయ్యలు పాల్గొన్నారు.