ల్యాండ్ డాక్యూమెంట్లు స్వాధీనం

by Sridhar Babu |
ల్యాండ్ డాక్యూమెంట్లు స్వాధీనం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:

కరీంనగర్ శివార్లలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేశారు. ల్యాండ్ మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఆదేశించడంతో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. శుక్రవారం కరీంనగర్ మండలం దుర్శేడు సమీపంలో ఓ వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వాహనంలో వేల సంఖ్యలో ల్యాండ్ డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్ శివార్లలో భూ మాఫియా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పూర్తి నివేదికలు ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాఫియా ఫేక్ డాక్యూమెంట్లను మాయం చేయాలని ప్లాన్ చేసుకుని తరలిస్తున్న క్రమంలో వాటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డాక్యూమెంట్లను సమగ్రంగా పరిశీలించి వివరాలు సేకరించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story