- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేసవి సెలవులున్నాయి కదా.. అందుకే ఆ బంగ్లా : ఐటీ దాడులపై తాప్సీ స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: తన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడులపై సినీనటి తాప్సీ స్పందించారు. ఐటీ దాడులు జరిగి మూడు రోజులు కావస్తున్నా దీనిపై స్పందించని ఆమె శనివారం ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మూడు ట్వీట్లు చేసిన ఆమె తన చివరి ట్వీట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్యంగా స్పందించారు.
తాప్సీ స్పందిస్తూ.. ‘మూడు రోజుల పాటు జరిగిన ఐటీ దాడులుపై మూడు విషయాలు. 1. నాకు పారిస్‌లో బంగ్లా ఉన్నదని ఆరోపిస్తూ వాటి తాళాల గురించి..! ఎందుకంటే వేసవి సెలవులు ముందున్నాయి కదా. 2. రూ. 5 కోట్లకు సంబంధించిన రిసీప్ట్ గురించి..! దానిని ఫ్యూచర్ కోసం భద్రంగా దాచుకున్నాను. ఎందుకంటే నేను దానిని గతంలో తిరస్కరించాను. 3. మన ఆర్థిక మంత్రి చెప్పినట్టు 2013లో నామీద జరిగిన ఐటీ దాడుల గురించి గుర్తు చేసుకుంటున్నాను..’ అంటూ రాసుకొచ్చింది. చివరలో ‘ఇది తగిన శాస్తి కాదు’ అని ముగించింది.
https://twitter.com/taapsee/status/1368055110434058249
గత కొద్దికాలంగా తాప్సీతో పాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపై వేలెత్తి చూపుతున్న నేపథ్యంలోనే వారిమీద ఐటీ దాడులు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రైతుల ఉద్యమానకి మద్దతివ్వడం కూడా ఐటీ దాడులకు కారణమని వాపోతున్నారు.