త్రిభాషా విధానాన్ని అమలు చేయం: తమిళనాడు సీఎం

by  |
త్రిభాషా విధానాన్ని అమలు చేయం: తమిళనాడు సీఎం
X

చెన్నై: కేంద్రం ఆమోదించిన త్రిభాషా విధానంపై తమిళనాడు సీఎం ఈ పళనిస్వామి ఆగ్రహించారు. ఈ విధానాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా అమలవుతున్న ద్విభాషా(తమిళం, ఆంగ్లం) విధానమే ఇకపైనా కొనసాగుతుందని ప్రకటించారు. త్రిభాషా విధానాన్ని తమిళనాడు అంగీకరించబోదని స్పష్టం చేశారు. నూతన విద్యా విధానం త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించడం బాధాకరమని ఆయన తెలిపారు.

దీన్ని కేంద్రం పున:సమీక్షించాలని, రాష్ట్రాలకు సొంత పాలసీని అమలు చేసే అనుమతించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఏ భాషనూ రుద్దదని, భాషలను ఎంచుకునే పాలసీని రాష్ట్రాల అభీష్టానికే వదిలిపెడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించిన తర్వాతి రోజే తమిళనాడు సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీ, సంస్కృతాలను తమపై రుద్దడానికి యత్నిస్తున్నారని తమిళనాట ఆందోళనలు వెలువడ్డ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఆ ప్రకటన చేయడం గమనార్హం.


Next Story

Most Viewed