తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్‌కు కరోనా

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. రాజధాని చెన్నైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో ప్రభుత్వం చెన్నైలో మరోసారి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Advertisement