నా కళ్లు దానం చేస్తా :సీఎం

దిశ వెబ్‎డెస్క్: నేత్ర దానానికి ఉపకరించే, అవగాహన పెంచేందుకు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‎సైట్‎ను సోమవారం సీఎం పళనిస్వామి ప్రారంభించారు. ఈ వెబ్‎సైట్ నేత్రదానంపై అవగాహన కల్పించనుంది. దానం చేసిన కళ్లను ఐ బ్యాంకులో భద్రపరిచి అవసరమైనప్పుడు వినియోగించనున్నారు. తన కళ్లు దానం చేస్తానని సీఎం పళనిస్వామి ప్రకటించారు. దీనికిగాను రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జే రాధాకృష్ణన్ సీఎంకు సర్టిఫికేట్ అందించినట్టు అధికారిక ప్రకటన వెల్లడించింది.

Advertisement