కరోనా కట్టడికి హీరో ధనుష్ రూ.15లక్షల సాయం

by Shyam |   ( Updated:2020-03-25 21:04:07.0  )
కరోనా కట్టడికి హీరో ధనుష్ రూ.15లక్షల సాయం
X

చెన్నై: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తమిళ హీరో ధనుష్ రూ.15 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును భారత సినీ కార్మిక సంక్షేమ సంఘాల సమాఖ్యకు అందజేశారు. ధనుష్‌తో పాటు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌లు కూడా రూ.10లక్షల చొప్పున సాయం ప్రకటించారు. కాగా, ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సైతం రూ.10లక్షల చెక్కును తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అందజేసిన విషయం తెలిసిందే.

Tags: hero dhanush, donation, 10 lakhs, corona, tamil hero, shankar, kamal haasan



Next Story