ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం

by Anukaran |
ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ తమిళ నటి విజయలక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఓ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ వీడియోలో వైరలవుతోంది. తన ఫేస్ బుక్ ఫాలోవర్స్ లో ఇద్దరి కారణంగా తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నది. వారు వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ తరుణంలో తాను ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఆ వీడియోను జూలై 26న ఆమె ఫేస్ బుక్ ఐడీలో పోస్ట్ చేసింది. అనంతరం ఆమె కొన్ని మాత్రలు మింగింది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Advertisement

Next Story